Share News

కందూరు పాఠశాలలో మాక్‌ అసెంబ్లీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 11:26 PM

అడ్డాకుల మండలం కందూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్‌ అసెంబ్లీ సమావేశ కార్యక్రమం నిర్వహించారు.

కందూరు పాఠశాలలో మాక్‌ అసెంబ్లీ
మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు

మూసాపేట, నవంబరు 13 (ఆంఽధ్రజ్యోతి) : అడ్డాకుల మండలం కందూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్‌ అసెంబ్లీ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులే అధికార పాలక పక్షం, ప్రతి పక్ష నాయకులు, శాసన సభ స్వీకర్‌గా మారి నమూనా అసెంబ్లీని ఉత్సాహంగా నడిపించా రు. శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్యలో పలు ఆంశాలపై విసృత్తంగా చర్చలు కొనసాగించారు. ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు అధికార పక్షం ముఖ్యమం త్రి, మంత్రులు తగు సమాధానాలు సభ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్‌ కోతలు, గ్రామీణ ప్రాంతా ల్లో నెలకొన్న సమస్యలపై ప్రతిపక్ష నాయకులు సభాధికారులకు తెలిపారు. జీరో అవర్‌లో కూ డా పలువురు ఎమ్మెల్యేలు పలు ఆంశాలపై చ ర్చించారు. జీహెచ్‌ఎం మురళి పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 11:26 PM