Share News

దుర్గామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:56 PM

గద్వాల మండలంలోని పూడూరులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం దుర్గామాతకుఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూజలు చేశారు.

దుర్గామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గద్వాల మండలంలోని పూడూరులో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం దుర్గామాతకుఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పలువురికి అన్నం వ డ్డించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవా లు ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్స రం కూడా అంగరంగ వైభవంగా మ హిళలు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ ద్వాల నియోజకవర్గంలో, గ్రామంలో, వార్డులలో ప్రజలందరి కి సకాలంలో వర్షాలు పడి రైతులకు, పాడిపరిశ్రమ అభివృద్ధికి అన్నివర్గాల వ్యాపారం అభివృద్ధి చెందాలని, ప్రజలంద రూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీ వించాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు బొజ్జన్న, మాజీ కౌన్సిలర్‌ మురళి, నాయకులు వంటభాస్కర్‌, మైలగడ్డ చంద్రశేఖర్‌, శ్యామ్‌రెడ్డి, కేశవ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పూడూరు పాండు ఉన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 11:56 PM