Share News

నగర అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:20 PM

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు.

నగర అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి
కేక్‌ కట్‌ చేస్తున్న ముడా చైర్మన్‌, గ్రంథాలయ చైర్మన్‌

- ఘనంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జన్నదినం

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే యెన్నం జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనితరెడ్డి, నాయకులు వినోద్‌కుమార్‌, ఎన్పీ వెంకటేష్‌, సురేందర్‌రెడ్డి, సీజే బెనహర్‌, సిరాజ్‌ఖాద్రీ, షబ్బీర్‌, అజ్మత్‌అలీ, రాములు యాదవ్‌, నవనీత్‌, ఫయాజ్‌, అవేజ్‌, పీర్‌ సాదిక్‌ పాల్గొన్నారు.

విజయవంతమైన రక్తదాన శిబిరం

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/హన్వాడ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి జన్మదినం సందర్భంగా జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రంగా అజ్మీర హాజరై శిబిరాన్ని ప్రారంభించగా, ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది, పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రక్తదానం చేశారు. హెచ్‌డీఎస్‌ సభ్యుడు రాఘవేందర్‌ పాల్గొన్నారు. హన్వాడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద నాయకులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు మహేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:20 PM