ఘనంగా ఎమ్మెల్యే బండ్ల జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:52 PM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గద్వాల ని యోజకవర్గంలో వేడుకలను అనుచరులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు.
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గద్వాల ని యోజకవర్గంలో వేడుకలను అనుచరులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను మునిసిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమోహన్‌రెడ్డిని చైర్‌పర్సన్ గజమాలతో ఘనంగా సత్కరించారు. కమిషనర్ పూలబొకేతో పాటు పే దవిద్యార్థులకు ఇవ్వడానికి నోట్ పుస్తకాలను ఎ మ్మెల్యేకు అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి కేక్‌ను తినిపించారు. కార్యక్రమంలో ము నిసిపల్ వైస్‌చైర్మన్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ఉన్నారు. అనంతరం దాత సహకారంతో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే నూతన బస్సును వి తరణ చేశారు. ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి రిబ్బన్ కట్‌చేసి బస్సును ప్రారంభించారు. ఎమ్మె ల్యే స్వయంగా బస్సును నడిపారు. జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లోని బీకేఎంఆర్ క్యాంటీన్‌లో సాధారణ ప్రజలు, ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే స్వయంగా భోజన ప్లేట్‌లను బాటసారులకు అందించారు. అనంతరం ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థినులకు తెలుగు అకాడమీ పుస్తకాలను అందజేశారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోజనం ప్లేట్లను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పచ్చర్ల శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
ధరూరు మండలంలో..
ధరూరులోని బీసీ బాలుర వసతిగృహంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ధరూర్ సర్పంచు డీఆర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ధరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి వైద్య పరికరాలు, ధరూర్ బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు దప్పట్లు పంపిణీ చేశారు.