మా ఊరికి మిషన్ భగీరథ నీరు అందించాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:12 PM
మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రాడం లేద ని, అరకొర నీటితో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని సింగవరం-1 గ్రామ సర్పంచ్ గొం గళ్ల ఈశ్వర్ మంగళవారం జోగుళాంబ గద్వా ల జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు.
సింగవరం-1 సర్పంచ్ ఈశ్వర్
అలంపూర్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు రాడం లేద ని, అరకొర నీటితో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని సింగవరం-1 గ్రామ సర్పంచ్ గొం గళ్ల ఈశ్వర్ మంగళవారం జోగుళాంబ గద్వా ల జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స ర్పంచ్ ఈశ్వర్ మాట్లాడుతూ అలంపూర్ మం డల పరిధిలోని సింగవరం-1 గ్రామానికి మిష న్ భగీరథ నీళ్లు కొన్ని రోజుల నుంచి అరకొర గా వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రానున్న ఎండాకాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఇకనైనా అధికారులు స్పందించి తాగునీటి సమ స్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రత్నకుమారి, మధురవాణి పాల్గొన్నారు.