నేడు మంత్రుల రాక
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:36 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వు సోమవారం మక్తల్‌కు రానున్నారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ, బహిరంగ సభ
మక్తల్/మక్తల్ రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వు సోమవారం మక్తల్‌కు రానున్నారు. ఉదయం 8 గం టలకు పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద నియోజకవర్గంలో రూ.320 కోట్లతో చేపట్టనున్న పలు రోడ్లకు భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మంత్రుల పర్యటనకు బందోబస్తు: డీఎస్పీ
మక్తల్‌లో మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొనే బహిరంగ సభా స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైక్ ర్యాలీ, నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. పర్యవేక్షణలో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐ రాజు, అధికారులు పాల్గొన్నారు.