వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:11 PM
యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ట్లు తెలంగాణ రాష్ట్ర క్రీడా, యువజన, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ న్నారు.
మక్తల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ట్లు తెలంగాణ రాష్ట్ర క్రీడా, యువజన, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ న్నారు. ఆదివారం మక్తల్ మండల పరిషత్ కా ర్యాలయ ఆవరణలో సెట్విన్ ఎండీ వేణుగోపా లరావుతో కలిసి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. యువతీ యువకు లు తమ తమ సామర్థ్యాలు బట్టి ఆయా రం గాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంపిక చే సుకున్న రంగాల్లో శిక్షణ అనంతరం ఉపాధి పొందవచ్చన్నారు. తమ ప్రభుత్వ హయాంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు సెట్విన్ లాంటి సంస్థలను జిల్లా, మండలాలకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. సెట్విన్ ఎండీ వేణుగోపాలరావు మాట్లాడుతూ కొన్ని అంశాల్లో మూడు నెలల శిక్షణ ఇస్తున్న ట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ భాస్కర్, డీ ఏవో జాన్‌సుధాకర్, ఎంపీడీవో రమేష్, తహసీ ల్దార్ సతీష్‌కుమార్, పుర కమీషనర్ శ్రీరాము లు, సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, నా యకులు లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, రవికుమార్, కట్టసురేష్‌కుమార్, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనతో దేశం అభివృద్ధి: ఎంపీ
ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం మక్తల్ పుర పాలిక పరిధిలోని 2వ వార్డు దండు గ్రామంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రపంచం మొత్తం నరేం ద్రమోదీ పాలనను ఆదరిస్తున్నారన్నారు. ఉమ్మ డి జిల్లా అభివృద్దికోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు అయినా మంజూరు చేయిస్తానన్నారు. చిత్తశుద్దితో పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాల ను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాల న్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, జిల్లా అద్యక్షుడు సత్యయాదవ్, బలరాంరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, కర్నిస్వామి తదిత రులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు కోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జా తీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సైకిల్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. త హసీల్దార్ సతీష్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు నాయకులు లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, రవికు మార్, కట్టసురేష్‌కుమార్, కోళ్ల వెంకటేష్ తది తరులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా గురుకుల పాఠశాల ప్రారంభం
మక్తల్ మండలంలోని గోలపల్లి గ్రామ సమీపంలో రూ. 250కోట్లతో 25ఎకరాల్లో ని ర్మించే యంగ్ ఎండియా గురుకుల పాఠశాల పనులను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అన్ని హంగులతో యంగ్ ఇండియా గురుకుల పాటశాల భవన నిర్మాణా న్ని త్వరలో పూర్తిచేసి పేద ప్రజలకు కార్పోరేట్ తరహా విద్యను అందిస్తామన్నారు.