Share News

మిల్లర్లు బకాయిపడ్డ సీఎంఆర్‌ చెల్లించాలి

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:25 PM

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు 2022-23 రబీ సీజన్‌లో ధాన్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి బకాయి పడ్డ సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు.

మిల్లర్లు బకాయిపడ్డ సీఎంఆర్‌ చెల్లించాలి
రైస్‌మిల్లర్లతో సమావేశమైన అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

  • రైస్‌మిల్లర్లతో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

గద్వాల, జూలై 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైస్‌ మిల్లర్లు 2022-23 రబీ సీజన్‌లో ధాన్యం కొ నుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి బకాయి పడ్డ సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని తన చాంబర్‌లో వారితో సమావేశమయ్యారు. మూడేళ్ల క్రితం 36,814 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరిం చి జిల్లాకు చెందిన 33మంది రైస్‌ మిల్లర్లకు అ ప్పగించామని అన్నారు. ఇందులో ఒక రైస్‌ మిల్ల ర్‌ మాత్రమే పూర్తి ధాన్యానికి డబ్బులు చెల్లించారని మిగిలిన వారు ఇవ్వలేదని అన్నారు. ఆ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం నాణ్యతలేదనే విమర్శలు రావడంతో ప్రభుత్వం కొంతవే లంపాట ద్వారా విక్రయించేందుకు నిర్ణయించిందన్నారు. వేలంపాటలో హక్కులు దక్కించుకు న్న వ్యక్తి కొంత ధాన్యం మాత్రమే తీసుకోవడం తో మిగిలిన ధాన్యం బకాయిలను రైస్‌మిల్లర్లు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా కొంద రు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అన్నారు. క్వింటా 2,236 చొప్పున చెల్లించాలని కోరితే మి ల్లర్లు రూ.1830 చెల్లిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. బకాయిపడ్డ సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని చెప్పారు. సమావేశంలో డీఎస్‌ఓ స్వామికుమార్‌, డీఎం విమల, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు ప్రశాంత్‌గౌడ్‌, రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రామలింగేశ్వర కామ్లే ఉన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:25 PM