Share News

మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - May 12 , 2026 | 11:19 PM

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బం దులు లేకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ చెప్పారు.

మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

గద్వాల న్యూటౌన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బం దులు లేకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మిల్లర్ల సమావేశంలో మాట్లాడుతూ... ధాన్యం కొనుగో లు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుం డా సకాలంలో మిల్లులకు తరలిస్తామని, ఇందు కు మిల్లర్లు సహకరించాలన్నారు. మిల్లు వద్ద ధాన్యం దించేటప్పుడు పర్యవేక్షణ సిబ్బందిని నియమిస్తామన్నారు. తప్పులు చేసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌వో స్వామికుమార్‌ మేనేజర్‌ విమల, రైస్‌ మిల్లర్ల సంఘం ప్రతినిధులు రామలింగేశ్వర్‌కామ్లే ఉన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:19 PM