వలస జిల్లాకే వలస
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:00 AM
అసలే కరువు చాయలు అలుముకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రాలయం కూలీలు వలస కట్టారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, నారాయణపేట జిల్లా నర్వ తదితర మండలాలకు మంత్రాలయం ప్రాంతం నుంచి కూలీలు గుంపులుగా చేరుకున్నారు.
- మంత్రాలయం టు మహబూబ్‌నగర్
- పొట్టచేత పట్టుకుని.. బతుకుజీవుడా అంటూ.. రాక
చిన్నచింతకుంట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అసలే కరువు చాయలు అలుముకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రాలయం కూలీలు వలస కట్టారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, నారాయణపేట జిల్లా నర్వ తదితర మండలాలకు మంత్రాలయం ప్రాంతం నుంచి కూలీలు గుంపులుగా చేరుకున్నారు. వీరితో పాటుగా ఎమ్మిగనూరు, ఆదోని తదితర పక్క రాష్ట్రం నుంచి కూడా మహబూబ్‌నగర్ జిల్లాకు చేరి, పత్తిచేల్లో బిజీబిజీగా ఉన్నారు. అక్కడ కూడా వర్షాభావంతో పాటు కరువుప్రభావం ఉన్నందువల్లే ఇక్కడకు ప్రతీ ఏటా వస్తున్నట్లు పలువురు కూలీలు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ పత్తి కూడా అంతగా కాయలేదని, కూలీడబ్బులు అంతగా పడే పరిస్థితి కన్పించటం లేదని రైతులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు.