కల్తీ కల్లుతో చెలగాటం..!
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:47 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు మాఫియా జడలు విప్పుకుంటోంది. కల్లు తాగేవారికి ఎక్కువ మత్తు కలిగించడం కోసం అ త్యంత ప్రాణాంతకమైన డ్రగ్స్‌ను వాడి కల్లు త యారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
- ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సీహెచ్, అల్ర్పాజోలం వినియోగం
- రాయిచూరు నుంచి తెచ్చి సరఫరా చేస్తున్న కల్తీకల్లు మాఫియా
- అయిజలో 134 కిలోలు పట్టివేత.. రాజోలిలో మరో 5 కిలోలు.?
- ఈత వనాలు లేకున్నా.. డిపోలు ఏర్పాటు చేసి కల్తీకల్లు తయారీ
- జూలైలో ఏకంగా అల్ర్పాజోలం తయారీ యూనిట్‌పై ఈగల్ దాడి
- కల్తీ అని తెలిసినా మిన్నకుండిపోతున్న ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ
ఆంధ్రజ్యోతి, మహబూబ్‌నగర్ ప్రతినిధి:
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు మాఫియా జడలు విప్పుకుంటోంది. కల్లు తాగేవారికి ఎక్కువ మత్తు కలిగించడం కోసం అ త్యంత ప్రాణాంతకమైన డ్రగ్స్‌ను వాడి కల్లు త యారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి క ల్లుగీత కార్మికులకు చేయూతను అందించడం, కులవృత్తి ద్వారా వచ్చే ఆదాయంతో వారు స్వా వలంబన సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లు విక్రయ కేంద్రాలను గతం నుంచే కొనసాగిస్తోంది. ఉత్పత్తి అయిన కల్లును సంబంధిత గీత పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో విక్రయిస్తుంటారు. వచ్చిన ఆదాయాన్ని పంచుకుని కుటుంబ పోషణ చేసుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ కల్లుదందా లాభార్జేనే ధ్యేయంగా నడుస్తోంది. రాజకీయ పార్టీల జోక్యం కూడా పెరగడంతో ఎవరి ప్రభుత్వాలు వస్తే అనుకూలురు ఈ దందాను కొనసాగిస్తున్నారు. గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్, గద్వాల జిల్లా కేంద్రాల్లో కల్లు పంచాయితీలు నడిచాయి. ఇటీవలే మహబూబ్‌నగర్‌లో సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఎన్‌డీపీఎ్‌స ఆధ్వర్యంలో తనిఖీలు జరిగి.. కేసులు నమోదైన నాటి నుంచి గద్వాల పట్టణంలో దందా విక్రయా లు నడపడం లేదు. అయితే గ ద్వాల మినహా మిగతా ప్రాం తాల్లో కూడా ఈ దందా నడిపించడం వెనుక రాజకీయ పార్టీల పాత్ర ఉంది. రాజకీయ నేతల ఆదేశాల కు అనుగుణంగా ఎక్సైజ్ అ ధికారులు నడుచుకోవడం షరా మామూలుగానే మారింది. అయితే రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉన్నా.. కల్లు డిపోలను ఎవరు నడిపించినా సామాన్యులకు పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు. అయితే ఎక్కువ లాభాలు సాధించడం, కల్లు తాగే వారిని మరింత బానిసలుగా మార్చడం కోసం ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ కల్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి.. ఆసుపత్రుల పాలవుతున్నారు. కానీ మత్తుకు అలవాటుపడిన వారు మానుకోలేకపోతున్నారు. వాస్తవానికి వీటిని నియంత్రించాల్సింది ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ.. అయినప్పటికీ ఉ మ్మడి జిల్లాలో విక్రయానికి సరిపడా కల్లు ఉత్పత్తి లేదనే విషయం వారికీ తెలిసినా.. వారు చర్యలు తీసుకోరు. ఎప్పుడైనా వారికి కావాల్సింది అందకపోయినా.. చర్యలకు ఉపక్రమిస్తారు. దందా నిర్వహించే వారి వెనుక రాజకీయ పార్టీల నాయకులే ఉండటంతో యథేచ్ఛగా కల్తీ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారీగా మత్తు పదర్థాలు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
జూలైలో అల్ర్పాజోలం.. ఇప్పుడు సీహెచ్
కల్లు తయారీలో మత్తు కలిగించడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా సీహెచ్, డైజో ఫాం, అక్కడక్కడా అల్ర్పాజోలం వాడతారనే విమర్శలు ఉన్నాయి. ఈ మూడు ప్రాణాంతకమైనవే అయినప్పటికీ సీహెచ్ పాతతరం నుంచి వస్తున్న మత్తు కలిగించే రసాయనం.. సీహెచ్‌ను నియంత్రించిన తర్వాత డైజోఫాంను వాడటం మొదలు పెట్టగా.. దాని ఖరీదు ఎక్కువ కావడం, అల్ర్పాజోలం ఖరీదు లక్షల్లో ఉండటంతో మళ్లీ సీహెచ్‌వైపు కల్లు తయారీదారులు మళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం జూలై 19న భూత్పూరు మండలం అన్నాసాగర్ శివారులోని లక్ష్మీనర్సింహ ఫౌలీ్ట్ర ఫాంపై మాదకద్రవ్యాల నిరోధం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ బృందం దాడులు చేసింది. ఆ ఫౌలీ్ట్రలో నిషేధిత అల్ర్పాజోలంతోపాటు దాని తయారీకి ఉపయోగించే పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాశ్‌గౌడ్, కృషయ్య, బాలాంజనేయులు, నర్సింహులును నిందితులుగా చూపారు. 1.150 కేజీల అల్ర్పాజోలంను సీజ్ చేయగా.. దాని విలువ రూ. 20.30 లక్షలుగా పేర్కొన్నారు. అయితే ఈ జయప్రకాశ్‌గౌడ్ అనే వ్యక్తి గతంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని మేధా హైస్కూల్‌లో ఇదే అల్ర్పాజోలం తయారీ కేసులో పట్టుబడి.. జైలు జీవితం గడిపి వచ్చారు. అయినా ఇందులో ఉన్న సంపాదనకు ఆశపడి సీరియల్ అఫెండర్‌గా మారిపోయాడు. తాజాగా బుధవారం అయిజ పట్టణంలో ఎక్సైజ్ అధికారులు చేసిన తనిఖీల్లో 134.55 కిలోల సీహెచ్ (క్లోరల్ హైడ్రేట్)ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతమొత్తం సీహెచ్ ఒకే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అలాగే ఇదే జిల్లా రాజోలిలో కూడా మరో అయిదు కిలోల సీహెచ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ అధికారిక ధ్రువీకరణ చేయలేదు. కర్ణాటకలోని రాయిచూరు నుంచి సీహెచ్‌ను ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు తయారీ చేస్తున్న వారికి తరలిస్తుండగా.. ఈ తనిఖీలు జరిగి పట్టుకున్నారు. అయితే చాలా సందర్భాల్లో అధికారులకు తెలిసి జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. దీనికీ ఓ కారణం ఉంది.. ఉత్పత్తికి తగిన చెట్లు లేకపోయినా విక్రయాలు జరుగుతుండటం.. ఏ రోజూ కల్లు తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఈగల్ ఫోకస్‌తోనే ఆటకట్టు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మత్తుపదర్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్‌పీఎ్‌స యాక్ట్‌ను సమర్థవంతంగా వినియోగించడం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచడం కోసం ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఫోర్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రత్యేక అధికారుల నియామకం కూడా చేపట్టారు. గంజాయి నుంచి మొదలుకుని డ్రగ్స్ వరకు అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నారు. పలుమార్లు రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై దాడులు నిర్వహించి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి.. డీ అడిక్షన్ సెంటర్‌కు కూడా తరలించారు. అయితే డ్రగ్స్‌తోపాటు ఈగల్ ఫోర్స్ కల్తీ కల్లు తయారీదారులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఉంది. అలవాటు అయిన వారు వ్యసనాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. మహబూబ్‌నగర్‌లో ఆసుపత్రులకు వెళ్లే మధ్య వయసు నుంచి పెద్ద వయసు వారిని డాక్టర్లు అడిగే మొదటి ప్రశ్న కల్లు అలవాటు ఉందా? అని అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు, హార్ట్ ఎటాక్ కేసులు పెరగడానికి కల్తీ కల్లు తాగడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. సారా రహిత రాష్ట్రంగా మార్చిన ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ద్వారా కల్తీ కల్లు తయారీపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.