Share News

పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:23 PM

ఉదండాపూర్‌ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌ అండ్‌ ఆర్‌) సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు.

పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఉదండాపూర్‌ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌ అండ్‌ ఆర్‌) సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. వల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 99 శాతం భూసేకరణ అవార్డులు పూర్తయ్యా యని తెలిపారు. భూసేకరణ, ఇళ్ల ప్యాకేజీ, స్థలాలకు సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఒక శాతం లబ్ధిదా రుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిశీలించి పరి ష్కరిస్తామని చెప్పారు. కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి వీలుగా సర్పంచుల గ్రామసభలు నిర్వహిం చి తీర్మానాలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే జనం పల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు గ్రామ సభలను త్వరగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌ సమ స్యలను 15 రోజుల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసు కోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ రామిరెడ్డి, ఆర్‌డీవో నవీన్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:23 PM