విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:31 PM
విద్యుత్ సమస్యతో ఇ బ్బంది పడుతున్న రైతులకు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేప ట్టినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆది వారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఆవరణలో నియోజకవర్గంలోని రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశారు.
- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాసరెడ్డి
పాలమూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ సమస్యతో ఇ బ్బంది పడుతున్న రైతులకు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేప ట్టినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆది వారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఆవరణలో నియోజకవర్గంలోని రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 19 సబ్‌స్టేషన్లు ఉండ గా, అందులో ఎమ్మెల్యేగా ఎంపికైన రెండున్నరేళ్లలో 11 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయించి నిర్మాణం చేయిస్తున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఎదురైన భూసమస్యలను పరిష్కరించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించి ఇప్పటికే కొన్నింటిని పూర్తి చేశామన్నారు. హన్వాడ మండలం, గొండ్యాలలో 132కేవీ సామర్థ్యం క లిగిన పెద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నేటి వరకు సింగిల్‌ఫేజ్, త్రీఫేజ్ కలిపి మొత్తం 587 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేశామన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డీఈ డి.లక్ష్మణ్‌నా యక్, ఏడీ సంతోష్‌కుమార్, ఏఈలు సి.నర్సిరెడ్డి, డీసీసీ కార్యదర్శి బు ద్దారం సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వి.మహేందర్, సు ధాకర్‌రెడ్డి, చెన్నయ్య, జి.నరసింహులు, టంకర కృష్ణయ్య, యాదిరెడ్డి, జె.వెంకటయ్య, గోవిందుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.