Share News

భక్తిశ్రద్ధలతో మట్టెద్దుల అమావాస్య

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:34 PM

నడిగడ్డ ప్రాంత ప్రజలు సంప్రదాయంగా జరు పుకునే మట్టెద్దుల అమావాస్యను మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో మట్టెద్దుల అమావాస్య
అయిజలో పూజలు అందుకున్న మట్టి ఎద్దులు

  • ఆలయాల్లో ప్రత్యేక పూజలు

గద్వాలటౌన్‌/అయిజ, జూలై14(ఆంధ్రజ్యోతి): నడిగడ్డ ప్రాంత ప్రజలు సంప్రదాయంగా జరు పుకునే మట్టెద్దుల అమావాస్యను మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జేష్టబహుళ అమా వాస్యను మట్టెద్దుల అమావాస్యగా జరుపుకునే సంప్రదాయం ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు నిర్వ హిస్తున్నారు. పండుగ రోజు మట్టితో తయారు చేసిన జోడు ఎద్దులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. కర్ణాటక సరిహద్దు గ్రా మాల్లో పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. అలాగే రైతులు జోడెద్దులతో పాటు ఆవును, మరో ముషికాన్ని(ఎలుక), పశువులను కట్టేసేం దుకు ఉపయోగించే గాడిపాడును మట్టితో సి ద్ధం చేసి పూజిస్తారు. దీంతోపాటు మంగళవా రం పట్టణంలోని పలు ఆలయాల వద్ద భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. హనుమా న్‌ ఆలయాల వద్ద భక్తులు పెద్దసంఖ్యలో స్వా మిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. స్థాని క షేరెల్లివీధి చౌలకాయ ఆంజనేయ, రాతిబు రుజు, సోమానాద్రినగర్‌, అశోక్‌నగర్‌, అడవేశ్వ ర ఆలయం, కృష్ణానదికి వెళ్లే రోడ్డులోని ఆంజనే యస్వామి, పిల్లిగుండ్లకాలనీలో వెలసిన ముడు పుల ఆంజనేయస్వామి ఆలయాల వద్ద భక్తుల కు పూజలు నిర్వహించగా, దాతల సహకారంలో ఆలయ నిర్వాహకులు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

అయిజ: అయిజలో మట్టి ఎద్దుల అమా వాస్యను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మంగళ వారం మట్టితో ఎద్దుల బొమ్మలను చేసి, ప్రత్యేక పూజలు చేశారు. పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా రైతులు తమ పశువులకు పూజలు చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 11:34 PM