Share News

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:39 PM

మేకల కోసం వెళ్లిన ఓ వ్యక్తి శవమై రైల్వేట్రాక్‌ పక్కన కనపడటంతో ఎవరో హత్యచేసి ఉంటారని కు టుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన జిల్లా కేంద్రంలో ఆ దివారం చోటు చేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

- హత్యచేసి రైల్వేట్రాక్‌ పక్కన పడేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ

గద్వాల క్రైం, నవంబరు 1 (ఆంరఽధజ్యోతి): మేకల కోసం వెళ్లిన ఓ వ్యక్తి శవమై రైల్వేట్రాక్‌ పక్కన కనపడటంతో ఎవరో హత్యచేసి ఉంటారని కు టుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన జిల్లా కేంద్రంలో ఆ దివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు తె లిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్రకాలనీలో ని వాసం ఉంటున్న మాణిక్యం(52) చెందిన గొర్రెలు ఆదివారం సాయంత్రం వరకు కొన్ని మాత్రమే ఇంటికి వచ్చాయి. మిగిలిన గొర్రెలు రాలేదని కాలనీ సమీపంలో ఉన్న రైల్వేట్రాక్‌ వెంట వెళ్లాడు. తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో భార్య తిరుపతమ్మ కుమారుడిని రైల్వేట్రాక్‌ వెంట పంపగా.. ఓ గుంత సమీపంలోనే మాణిక్యం అనుమానాస్పద మృతి చెం ది పడి ఉండటంతో ఎవరో హత్యచేసి ఇలా ట్రాక్‌ ప్రక్కన పడేశారని, మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు.

Updated Date - Nov 01 , 2026 | 11:39 PM