యాసిడ్ దాడిలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:24 PM
గుర్తు తెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నా రాయణపేట జిల్లాలో మరికల్ మండలంలో జరిగింది.
- వివాహేతర సంబంధమే కారణం?
మరికల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గుర్తు తెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నా రాయణపేట జిల్లాలో మరికల్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్ర కారం బుధవారం అర్ధరాత్రి మాధవరం గ్రా మంలో బాలస్వామి(46) అనే వ్యక్తి కుటుం బ సభ్యులతో కలిసి తన ఇంటిలో నిద్రకు ఉ పక్రమించాడు. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియ ని వ్యక్తులు వచ్చి వారి ఇంటి తలుపుతట్టా రు. ఆ శబ్దానికి బాలస్వామి భార్య రాముల మ్మ నిద్రలేచి తలుపులు తెరువగా నలుగురు వ్యక్తులు కత్తులు చూపించి బెదిరించారు. దీంతో రాములమ్మ ఇంటిలో నుంచి భయం తో బయటికి వెళ్లిపోయింది. వచ్చిన వ్యక్తు లు నిద్రలో ఉన్న బాల స్వామిపై యాసిడ్ పోసి పరారయ్యారు. అయనకు తీవ్ర గాయా లు కావడంతో కుటుం బీకులు వెంటనే మ హబూ బ్‌నగర్‌లోని జనరల్ ఆసుపత్రికి తర లించారు. అక్కడి నుంచి మైరుగైన వైద్యం కో సం హైదరాబాద్‌లోని ఉస్మానియా అసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ బాలస్వా మి మృతి చెందాడు. గురువారం స్థానిక ఎస్‌ఐ రా మ్‌లాల్ సి బ్బందితో వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. మృతుడి కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశా రు. బాలస్వామికి ఉన్న వివాహేతర సంబం ధం వల్లే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.