Share News

కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:40 PM

కటింగ్‌ చేయించుకునేందుకు వచ్చి తిరిగి ఇంటికి వె ళ్లేందుకు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండ గా.. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు.

 కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం

మిడ్జిల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కటింగ్‌ చేయించుకునేందుకు వచ్చి తిరిగి ఇంటికి వె ళ్లేందుకు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండ గా.. వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మహ బూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని బో యిన్‌పల్లి గ్రామంలోని 167వ జాతీయ రహ దారిపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికు ల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊ ర్కొండ మండలం బాల్యాలోక్యాతండాకు చెందిన దేవ్య(38) ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన బైక్‌పై బోయిన్‌పల్లి గ్రామానికి వచ్చి కటింగ్‌ చేయించుకొని రోడ్డు అవతల ఉన్న బండిని తీసుకునేందుకు దాటుతుండగా కల్వకుర్తి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు దేవ్యను ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. భార్య ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.

బైక్‌పై వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఢీకొని..

తిమ్మాజిపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజి పేట మండల శివారులో ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన దాసర్ల తిరుపతయ్య అనే వ్యక్తి జడ్చర్ల నుంచి బైకుపై లింగాలకు వెళ్తుండగా వనపర్తి నుంచి హైదరా బాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. అతని దగ్గర ఉన్న లైసెన్సు ద్వారా పూర్తి వివరాలు తెలిసినట్లు స్థానికులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 11:40 PM