Share News

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:08 PM

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుందని రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపారు.

  రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

గద్వాల క్రైం, మార్చి 22 (ఆంరఽధజ్యోతి): రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుందని రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారానికి చెందిన కూలీ పనులు చేసుకుంటున్న మునిస్వామి (50) శనివారం రాత్రి గద్వాల, పూడూరు రైల్వేస్టేషన్‌ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో మొండెం నుంచి తల వేరుగా పడింది. అయితే ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియలేదు. మృతుడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ ఆశోక్‌ తెలిపారు.

ఉద్యోగం రావడం లేదని..

రాజేంద్రనగర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ నపర్తి తూర్పు తండాకు చెందిన గోపాల్‌, మణె మ్మ బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి శివరాంపల్లి వీకర్‌ సెక్షన్‌ కాలనీలో నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు నానవత్‌ సిద్ధార్థ్‌ డిగ్రీ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూశాడు. రాకపోవడంతో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. ఒత్తిడి కారణంగా రెండు మూడు నెలలు పనిచేసి మానేశాడు. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్నాడు. పనికి వెళ్లి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపులకు లోపల గడియ పెట్టి ఉండడంతో పిలిచినా సిద్దార్థ్‌ తీయలేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సిద్ధార్థ్‌ ఉరేసుకోవడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:08 PM