Share News

విద్యుత్‌ కార్మికుల జిల్లా సదస్సు జయప్రదం చేయండి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:39 PM

విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ స్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని ఎనుగొండ వద్ద సోమవారం ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు టీవీఏఈ జేఏ సీ జిల్లా నాయకుడు దొడ్ల సైదులు, మోయిజ్‌, శ్రీనివాసులు, గోపాల్‌ తెలిపారు.

విద్యుత్‌ కార్మికుల జిల్లా సదస్సు జయప్రదం చేయండి
విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల జిల్లా సదస్సు జయప్రదం చేయాలని కోరుతున్న ఆ సంఘం నాయకులు

కల్వకుర్తి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ స్యల పరిష్కారం కోసం మహబూబ్‌నగర్‌ జి ల్లాలోని ఎనుగొండ వద్ద సోమవారం ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు టీవీఏఈ జేఏ సీ జిల్లా నాయకుడు దొడ్ల సైదులు, మోయిజ్‌, శ్రీనివాసులు, గోపాల్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని కోరు తూ కల్వకుర్తి పట్టణంలోని 220కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు మార్చాల 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కార్మికులతో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న దాదాపు 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తున్నట్లు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటించి మోసం చేసిందని మండిపడ్డారు. విద్యుత్‌ సంస్థలో ఒకే రకమైన విధులు నిర్వ హిస్తున్న కార్మికులకు రెం డు రకాల సర్వీస్‌ రూల్స్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెం డు సంవత్సరాలు దాటిన ప్పటికీ ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి లోపు ఆ ర్టిజన్‌ కార్మికులను విద్యు త్‌ సంస్థలలో కన్వర్షన్‌ చేయకపోతే మార్చి నె ల నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని వా రు హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించి విద్యుత్‌ శాఖలో చాలీచాలనీ వేత నాలతో పని చేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమ స్యలను వెంటనే పరిష్కరించాలని వారు డి మాండ్‌ చేశారు.

Updated Date - Jan 04 , 2026 | 11:39 PM