Share News

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:36 PM

పేదల సొంతి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
లబ్ధిదారులకు కానుకలు అందజేస్తున్న ఎమ్మెల్యే బండ్ల, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి

  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మంజూరైన ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చే సుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పట్ట ణంలోని ఏడు, 11, 20వ వార్డులో లబ్ధిదారులు కృష్ణ, వీరేశ్‌, జయమ్మ, శ్రీధర్‌, నాగరాజు ఇళ్లను ఆదివారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి కానుకల అందజేసిన ఎమ్మెల్యే, పెండింగ్‌లో ఉ న్న ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులుగా ఎంపికైన వారు వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణం జరిగిన వెంటనే పూర్తిస్థాయిలో బిల్లు లు అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్ర మంలో వైస్‌ చైర్మన్‌ శంకర్‌, నాయకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, రామన్‌గౌడ, రాజశేఖర్‌రెడ్డి, విజ య్‌, సత్యారెడ్డి, గోవిందు, దౌలు, మురళి, సుధా కర్‌, కురుమన్న, భాస్కర్‌, సుదర్శన్‌, మోసిన్‌, ధర్మనాయుడు, మధు ఉన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:36 PM