వాలీబాల్ డబుల్ విజేత మహబూబ్‌నగర్
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:33 PM
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థా యి అండర్-19, ఎస్‌జీఎస్ 70వ బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉమ్మ డి మహబుబ్‌నగర్ జిల్లా డబుల్ చాంపియన్‌గా (బాలుర, బాలికల) జట్లు నిలి చాయి.
- ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్-19 బాలబాలికల టోర్నీ
రాజాపూర్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థా యి అండర్-19, ఎస్‌జీఎస్ 70వ బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉమ్మ డి మహబుబ్‌నగర్ జిల్లా డబుల్ చాంపియన్‌గా (బాలుర, బాలికల) జట్లు నిలి చాయి. ద్వితీయ స్థానంలో బాలుర రంగారెడ్డి, బాలికల నిజామాబాద్, తృతీయ స్థానంలో బాలుర వరంగల్, బాలికల రంగారెడ్డి జిల్లాల జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా చాంపియన్ జట్లకు రూ.20వేల చొప్పున, ద్వితీయ స్థానం జట్లకు రూ.10వేల చొప్పున, తృతీయ స్థానం జట్లకు రూ.5వేలతో పాటు జట్లకు షీల్డ్‌ల ను అందజేశారు. కార్యక్రమంలో వేణుగోపాల్, దుష్యంత్ రెడ్డి, చెన్నవీరయ్య, శేఖర్‌గౌడ్, వినోద్ పాల్గొన్నారు.