వన్‌డే లీగ్‌లో మహబూబ్‌నగర్ గెలుపు
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:17 PM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సి-డివిజన్ వన్‌డే లీగ్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జిల్లా జట్టు 131 పరుగుల తేడాతో సట్టన్ జట్టుపై గెలిచింది.
- 131 పరుగుల తేడాతో సట్టన్ క్లబ్ జట్టుపై విజయం
- సెంచరీతో రాణించిన రామ్‌కుమార్‌చారి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సి-డివిజన్ వన్‌డే లీగ్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జిల్లా జట్టు 131 పరుగుల తేడాతో సట్టన్ జట్టుపై గెలిచింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సట్టన్ క్రికెట్ క్లబ్-ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జట్టు తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌న గర్ జట్టు 45.3 ఓవర్లలో 253 పరుగులకు అలౌట్ అయ్యింది. జట్టు ఓపెనర్ రామ్‌కుమార్‌చారి 117 బంతుల్లో 11 ఫోర్లతో 110 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. అఫాన్ 16, ఆర్.చరణ్ 18 పరుగులు చేశారు. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన సట్టన్ క్రికెట్ క్లబ్ జట్టు 42.5 ఓవర్లలో 115 పరుగులకు కు ప్పకూలింది. జట్టులో అభిరామ్ 44, శర్మ 23 పరుగులు చేశారు. జిల్లా బౌల ర్లలో అభినవ్, వసికర్ చెరో 3, దనూష్ 2 వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశారు. జట్టు విజయం సాధించడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జట్టు క్రీడాకారులను, కోచ్ ముఖ్తర్‌ను అభినందించారు.