Share News

హెచ్‌సీఏ వన్‌డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ గెలుపు

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అండర్‌-19 వన్‌డే టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు విజయం సాధించింది.

హెచ్‌సీఏ వన్‌డే లీగ్‌లో   మహబూబ్‌నగర్‌ గెలుపు
గెలిచిన మహబూబ్‌నగర్‌ జట్టుతో కోచ్‌ మన్నాన్‌

- 9వికెట్ల తేడాతో నల్గొండపై విజయం

- అర్ధసెంచరీలతో రాణించిన అబ్దుల్‌రాఫె, వర్షిత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అండర్‌-19 వన్‌డే టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు విజయం సాధించింది. మెదక్‌ ఎంఏ మైదానంలో మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లో చేసిన టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నల్గొండ జట్టు 38.3 ఓవర్లలలో 184 పరుగులకు అలౌట్‌ అయ్యింది. జట్టులో కిరణ్‌ 90, అమన్‌ 40 పరుగులు చేశారు. జిల్లా బౌలర్లలలో వర్షిత్‌రెడ్డి 3. అబ్దుల్‌రాఫె 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ జట్టు 41 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 187 పరుగులు చేసింది. 9 వికెట్ల తేడాతో నల్గొండ జట్టుపై విజయం సాధించింది. జట్టులో అబ్దుల్‌రాఫె 95, వర్షిత్‌రెడ్డి 71 పరుగులు అర్ధసెంచరీలతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయానికి కృషి చేశారు. అల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి కృషి చేసిన రాఫె, వర్షిత్‌ను జిల్లా క్రికెట్‌ సంఘం సెక్రటరీ ఎం. రాజశేఖర్‌ జిల్లా అభినందించారు.

Updated Date - Feb 10 , 2026 | 11:32 PM