ఫైనల్‌కు చేరిన మహబూబ్‌నగర్
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:40 PM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మహిళల టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జటు ఫైన ల్‌కు చేరింది. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని క్రికెట్ మై దానంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్-ఖమ్మం జట్లు తలబడ్డాయి.
- హెచ్‌సీఏ టోర్నీలో 34 పరుగుల తేడాతో ఖమ్మంపై విజయం
- 5 వికెట్లు తీసి రాణించిన ప్రవళిక
- 4 వికెట్లు తీసిన మేఘన
- నేడు వరంగల్‌తో అమీతుమీ
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మహిళల టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జటు ఫైన ల్‌కు చేరింది. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని క్రికెట్ మై దానంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్-ఖమ్మం జట్లు తలబడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ జట్టు 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చే సింది. జట్లులో ఆర్యాని 41, అక్షరరాథోడ్ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు 17 ఓవర్లలో 69 పరుగులకు కూప్పకూలింది. వైష్ణవి 31 పరుగులు చేసింది. 34 పరుగుల తేడాతో మహబూబ్‌నగర్ గెలిచి ఫైనల్‌కు చేరింది. జట్టు బౌలర్లలో ప్రవళిక 5, మేఘన 4 వికెట్లు తీసి జట్టు విజ యానికి కృషి చేశారు. నేడు వరంగల్ జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలబడనుంది. జిల్లా మహిళల జట్టు ఫైనల్‌కు చేరడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం సెక్రటరీ ఎం.రాజశేఖర్ అభినందించారు. జిల్లా జట్టు విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.