Share News

మహబూబ్‌నగర్‌ - చించోళి.. రయ్‌..రయ్‌..

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:08 AM

మహబూబ్‌నగర్‌ - చించోళి రహదారి నిర్మాణం ఎట్టకేలకు పూర్తవడంతో వాహనాలు రయ్‌.. రయ్‌.. మని రాకపోకలు సాగించనున్నాయి.

మహబూబ్‌నగర్‌ - చించోళి.. రయ్‌..రయ్‌..
భూత్పూర్‌ - చించోళి రహదారి

- నాలుగేళ్ల తరువాత అందుబాటులోకి వచ్చిన రహదారి

- 4.5 కిలోమీటర్లు మినహా 60 కిలోమీటర్ల రోడ్డు పూర్తి

- ప్రారంభమైన వాహనాల రాకపోకలు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 23 (ఆంధ్ర జ్యోతి) : మహబూబ్‌నగర్‌ - చించోళి రహదారి నిర్మాణం ఎట్టకేలకు పూర్తవడంతో వాహనాలు రయ్‌.. రయ్‌.. మని రాకపోకలు సాగించనున్నాయి. దాదాపు నాలుగేళ్ళ తరువాత ఈ రోడ్డు అందుబా టులోకి వచ్చింది. పాలమూరు నగర శివారులో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేసిన అధికారులు బుధవారం నుంచి రాకపోకలకు అనుమతి ఇచ్చా రు. భూత్పూర్‌ నుంచి చించోళి వరకు 117 కిలోమీ టర్లు ఉన్న ఈ రహదారిలో మొదటి విడతలో భూత్పూర్‌ నుంచి దుద్యాల వరకు 60 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. అందులో 90 కల్వర్టులు, ఒక ఆర్‌ఓబీ, ఒక ఎల్‌వీయూబీ నిర్మాణం చేపట్టారు. అందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది.

రెండు కిలోమీటర్ల అటవీ ప్రాంతం

మొత్తం 60 కిలోమీటర్ల రహదారిలో రెండు కిలోమీటర్లు హన్వాడ మండలం చిన్నదర్పల్లి అట వీ ప్రాంతంలో పనులు నిలిచిపోయాయి. ఇక్కడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి స్థల సేకరణ కు అనుమతులు రావాల్సి ఉంది. ఇప్పటికే అటవీ శాఖ నుంచి స్టేజ్‌-1 అనుమతులు లభించగా, స్టేజ్‌-2 అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపిం చారు. అలాగే హన్వాడ మండలానికి చెందిన మూడు గ్రామాల పరిధిలోని 2.50 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు అనుమతులు రావాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 182 ఇళ్లను తొలగించాల్సి ఉంది. యజమానులకు ఇప్పటికే నోటిసులు ఇచ్చి పరిహారం అంచనా కూడా రూపొందించారు. వారి కి రూ.8 కోట్ల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. పరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు విస్తరణ పను లు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అలాగే బండమీదిపల్లి - అల్లీపూర్‌ల మధ్య అధికారులు సర్వీస్‌ రోడ్‌ను ప్రతిపాదించగా గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పనిస రిగా అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని ఆందోళన చే పట్టారు. అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధు లు స్పందించి అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టారు.

నగరంలో ట్రాఫిక్‌జామ్‌కు చెక్‌

ప్రస్తుతం నగరం మీదుగానే వాహనాలు వె ళ్తుండటంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రాయిచూర్‌ నుంచి తాండూర్‌ వైపు వెళ్ళే వాహ నాలు, భూత్పూర్‌ మీదుగా కోస్గి, తాండూర్‌, కొడంగల్‌ వెళ్ళే రవాణా, గూడ్స్‌ వాహనాలన్నీ నగరం మీదుగా వెళ్తుండటంతో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. నూతన రహదారి మీదుగా రాకపోకలకు బుధ వారం నుంచి అనుమతించారు. దీంతో నగరం లో వాహనాల రద్దీ చాలా వరకు తగ్గిపోను న్నది. అదే విధంగా హైదరాబాద్‌ - నారాయణ పేట - మక ్తల్‌ - రాయిచూర్‌ వెళ్ళే వాహనాలు, నగరంతో సంబంధం లేకుండా భూత్పూర్‌, పిస్తాహౌస్‌ బైపాస్‌ల మీదుగా నేరుగా వెళ్ళేం దుకు మార్గం సుగమమైంది. దీంతో దూరం తగ్గడంతో పాటు సమయం ఆదా కానున్నది.

Updated Date - Sep 24 , 2026 | 12:08 AM