Share News

సెమీస్‌కు చేరిన మహబూబ్‌నగర్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:30 PM

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ బాలుర క్రికెట్‌ టోర్నీ రసవత్తంగా కొనసా గుతోంది.

సెమీస్‌కు చేరిన మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌ - ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఉత్కంఠభరిత సందర్భం

- ఖమ్మం జట్టుపై 54 పరుగుల తేడాతో విజయం

- నేడు ముగియనున్న రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ బాలుర క్రికెట్‌ టోర్నీ రసవత్తంగా కొనసా గుతోంది. జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఆర్‌, ఎండీసీఏ మైదానాల్లో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లలో విజయం సాధించి మహబూబ్‌నగర్‌, మెదక్‌, హైద రాబాద్‌, రంగారెడ్డి జట్లు సెమీస్‌కు చేరాయి. అంతకు ముందు ఎండీసీఎం మైదానంలో మూడవ రోజు జరిగిన క్రికెట్‌ పోటీలను ఎస్‌జీఎఫ్‌ మాజీ సెక్రటరీ సురేష్‌కుమార్‌, ఎండీసీఏ కార్యదర్శి రాజశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్ర టరీ వేణుగోపాల్‌, వ్యాయమ ఉపాధ్యాయులు రాఘ వేందర్‌, నాగరాజు, బాల్‌రాజ్‌, అబ్లుల్లా, అరుణజ్యోతి, స్వప్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

  • బీఎస్‌ఆర్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు ఖమ్మంపై 54 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. సిద్ధార్థ 31, బీరేందర్‌ 35 పరుగులు చేశారు. ఖమ్మం జట్టులో నాయక్‌, ఉన్నత్‌ చేరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి ఓటమి పాలైంది. జట్టులో ఉన్నత్‌ 30 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లలో సిద్ధార్థ్‌ మూడు వికెట్లు తీసి బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో రాణించాడు. ఫైజన్‌ రెండు, గగన్‌, మణిచరణ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఉత్సాహభరితంగా కొనసాగుతున్న టోర్నీ మంగళవారం ముగియనున్నది.

  • మరో మ్యాచ్‌లో వరంగల్‌ జట్టు నల్గొండపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టులో అనస్‌ అర్ధ సెంచరీతో రాణించాడు.

  • ఎండీసీఎ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ జట్టు కరీంనగర్‌పై 15 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది.

  • రెండో మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు ఆదిలా బాద్‌పై 71 పరుగుల తేడాతో గెలిచింది. రంగారెడ్డి జిల్లా బౌలర్లలో హర్షవర్ధన్‌ మూడు వికెట్లు తీశారు.

  • 3వ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు కరీంనగర్‌ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • మంగళవారం నిర్వహించనున్న సెమీస్‌లో మహబూబ్‌నగర్‌ - మెదక్‌, రంగారెడ్డి - హైదరాబాద్‌ జట్లు తలబడనున్నాయి.

Updated Date - Nov 02 , 2026 | 11:30 PM