Share News

దేవాలయ, గాంధీ ట్రస్టు భూములపై లోకాయుక్త విచారణ

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:42 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్ల పట్టణంలోని వేంక టేశ్వరస్వామి ఆలయం, గాంధీ ట్రస్టు భూముల పై లోకాయుక్త బృందం మంగళవారం విచారణ చేపట్టింది.

దేవాలయ, గాంధీ ట్రస్టు భూములపై లోకాయుక్త విచారణ
ఆలయ భూములపై విచారణ నిర్వహిస్తున్న లోకాయుక్త బృందం

జడ్చర్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా, జడ్చర్ల పట్టణంలోని వేంక టేశ్వరస్వామి ఆలయం, గాంధీ ట్రస్టు భూముల పై లోకాయుక్త బృందం మంగళవారం విచారణ చేపట్టింది. జడ్చర్ల పట్టణంతో పాటు భూత్పుర్‌ మండలం తాడిపర్తిలోని ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని జడ్చర్లకు చెందిన సామాజికవేత్త అనిల్‌కుమార్‌ లోకాయుక్తను ఆశ్రయించారు. వాటితో పాటు పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీట్రస్టు భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు లోకాయుక్త ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆలయ భూములు, ఎక్కడ, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి? ఆ భూముల్లో ఎవరైనా గృహ నిర్మాణాలు చేపట్టారా? తదితర అంశాలపై విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విచారణలో లోకాయుక్త బృందంతో పాటు జడ్చర్ల తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, ఫిర్యాదుదారుడు అనిల్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:42 PM