Share News

ఆల్బెండజోల్‌తో నులిపేద్దాం

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:41 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏడాది నుంచి 19 సంవత్సరాల్లోపు గల బాలబాలికలు మొత్తం 1,71,354 మంది ఉండగా నేడు 1,63,723 మం దికి నులిపురుగల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసినట్లు డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి అన్నారు.

ఆల్బెండజోల్‌తో నులిపేద్దాం

  • జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

  • 95.54 శాతం లక్ష్యం పూర్తి

గద్వాల న్యూటౌన్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏడాది నుంచి 19 సంవత్సరాల్లోపు గల బాలబాలికలు మొత్తం 1,71,354 మంది ఉండగా నేడు 1,63,723 మం దికి నులిపురుగల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసినట్లు డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా ఆమె విద్యార్థినులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుటికే జిల్లాలో 95,54 శాతం లక్ష్యం సాధించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు మహమ్మద్‌అజ్గర్‌ అలీ, రాజు, ప్రసూనారాణి, ఎస్‌ఐ తిరుమల్‌రెడ్డి, డీపీహెచ్‌ఎన్‌వో వరలక్ష్మి, డీవీఎల్‌ఎం నరేందర్‌బాబు, ఇన్‌చార్జి డెమో హీర్యనాయక్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వైద్యాధికారులు శరణ్య ఉన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:41 PM