రాజ్యాంగ విలువల విధ్వంసాన్ని అడ్డుకుందాం
ABN , Publish Date - Feb 12 , 2026 | 10:59 PM
ఇష్టారాజ్య పాలనతో దేశంలో సాగుతున్న రా జ్యాంగ విలువల విధ్వంసాన్ని సంఘటితంగా ఎ దుర్కొందామని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అ న్నారు.
డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి
విజయవంతమైన సార్వత్రిక సమ్మె
గద్వాల టౌన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఇష్టారాజ్య పాలనతో దేశంలో సాగుతున్న రా జ్యాంగ విలువల విధ్వంసాన్ని సంఘటితంగా ఎ దుర్కొందామని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అ న్నారు. సామ్రాజ్యవాదులను సైతం ఎదురించి పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న నేటి పాలకుల తీరును ముక్తకంఠంతో ఖండించా లన్నారు. జాతీయ కార్మిక, రైతు సంఘాలు ఇచ్చి న పిలుపుమేరకు గురువారం జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతంమైంది. ఈసందర్భంగా స్థా నిక పాతబస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిం చారు. సమ్మెకు పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించిన డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, హక్కు ల పరిరక్షణ కోసం కార్మికులు, రైతులు, తలపెట్టి న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా మద్దతునిస్తుందన్నారు. అనంతరం సంఘాల నాయకులు ఉప్పేరు నరసింహ, హనుమంతు, కార్తీక్ మాట్లాడుతూ నూతన నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగింపుతో పాటు పబ్లిక్ రంక సంస్థల విక్రయాలను నిలిపివేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఏళ్ల తరబడిగా కార్మికుల శ్రమతో పోగు చేసిన జాతీయ సంపదను స్వే చ్ఛా వాణిజ్యం పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ శక్తు లకు అప్పగించే కుట్రలను తాము సంఘటితం గా ప్రతిఘటిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రా క్ట్ పద్ధతులను ఎత్తివేసి కార్మికులను ఉద్యోగులు గా గుర్తించి కనీస వేతనం అందజేయాలని, ఉ పాధి హామీ ద్వారా కూలీలకు 200 పనిదినాలు కల్పించాలని, అసంఘటిత రంగంలోని కార్మికు లకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు రవికుమార్, సంయుక్త కిసాన్ మో ర్చా జిల్లా కన్వీనర్ గోపాల్, టీపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న మద్దతు ప్రకటించారు. సమ్మెలో పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐతో పాటు అనుబంధ సంఘాల నాయకులు హరీశ్, అంజి, పద్మ, సునీత, తిమ్మప్ప, జయాకర్ ఉన్నారు.