బీఆర్‌ఎస్ జెండా ఎగురవేద్దాం
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:25 PM
మునిసిపల్ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సమయస్పూర్తితో పనిచేయాలని, ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాదిరి నియోజవర్గంలోని మూడు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు, కార్యక్తలకు సూచించారు.
- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సమయస్పూర్తితో పనిచేయాలని, ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మాదిరి నియోజవర్గంలోని మూడు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేద్దామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులు, కార్యక్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలనలో నియోజవర్గంలోని కొత్తకోట, భూత్పూర్, దేవరకద్ర పట్టణాల్లో మునిసిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. దేవరకద్ర మునిసిపాలిటీ ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్ హయాంలోనే ప్రభుత్వం ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ఈ మూడు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించుకునే విధంగా మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బస్వరాజుగౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పాల నర్సింహులుగౌడ్, మురళిధర్‌గౌడ్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చంద్రమౌళి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.