Share News

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:00 PM

చె త్త చెదారాన్ని రోడ్డడపై వేయకుండా ఇంటి ముంగిట్లో వచ్చే చెత్త ఆటోల్లో వేసి స్వచ్ఛ నారా యణపేటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగ్యస్వా ములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొంత శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు.

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట బీసీకాలనీలో పర్యటిస్తున్న చైర్‌పర్సన్‌ కొండ శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండ శ్వేత

నారాయణపేట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): చె త్త చెదారాన్ని రోడ్డడపై వేయకుండా ఇంటి ముంగిట్లో వచ్చే చెత్త ఆటోల్లో వేసి స్వచ్ఛ నారా యణపేటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగ్యస్వా ములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొంత శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు. 99 రో జుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ఆదివారం మునిసిపాలిటీ పరిధిలో ని 5, 6 వార్డులలో మునిసిపల్‌ అధికారులతో కలిసి పర్యటించి పారిశుధ్య పనులు మెరుగు పర్చేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. మురుగు కా ల్వల పూడిక తీతతో పాటు ముళ్లపొదలను ఎక్స్‌ కవేటర్‌తో తొలగించారు. వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని, అంటురోగాలను తరమివేయాలని చైర్‌పర్సన్‌ సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రాఘ వేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, రాఘవేందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ గొల్కొండ నర్సయ్య, మునిసిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:00 PM