Share News

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:20 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో వందశాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి, నియోజవర్గంలోని మూడు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేద్దామని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుందాం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : మునిసిపల్‌ ఎన్నికల్లో వందశాతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి, నియోజవర్గంలోని మూడు మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేద్దామని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్‌లో ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్‌ మునిసిపాలిటీలోని బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు హాజరుకాగా, మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించామో అదే స్ఫూర్తితో మునిసిపాలిటీ ఎన్నికల్లో విజయ దుందుభీ మోగించాలని సూచనలు, సలహాలు ఇచ్చారు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు

ఆలన్న యువ ఉద్యోగ యాప్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటీ పరీక్షలకు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని యాప్‌ రూపరక్త చక్రవర్తి పేర్కొన్నారు. 2013 ఆగస్టులో ఈ యాప్‌ను ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారని నాటి నుంచి నేటి వరకు ఈ యాప్‌ ద్వారా 6 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవడానికి వినియోగించుకున్నారని తెలపారు. ఈ యాప్‌ను నిరంతరం కొనసాగించాలన్న లక్ష్యంతో నిరుద్యోగ యువతీ యువకులు మరోమారు ఈ యాప్‌ను రిజిస్టేషన్‌ చేసుకోవాలన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బస్వరాజ్‌గౌడ్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ మూసాపేట : అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచు సాయిసాగర్‌ బీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ ఎమ్మెల్యే ఆల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, ఖాజాగోరి, తిరుపతిరెడ్డి, రమేష్‌, మహేష్‌యాదవ్‌, జహంగీర్‌గోరి, శ్రీనివాసులు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:20 PM