Share News

గ్రాడ్యుయేట్‌లందరినీ ఓటర్లుగా నమోదు చేద్దాం

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:32 PM

అర్హులైన గ్రాడ్యుయేట్‌లందరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా పేర్లు ఎన్‌రోల్‌ చేయించాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రాడ్యుయేట్‌లందరినీ ఓటర్లుగా నమోదు చేద్దాం
ఎమ్మెల్సీ ఎన్‌రోల్‌మెంట్‌ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభిస్తున్న నేతలు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన గ్రాడ్యుయేట్‌లందరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా పేర్లు ఎన్‌రోల్‌ చేయించాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో అత్యధిక ఎన్‌రోల్‌మెంట్‌లు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం డీసీసీ కార్యాయంలో ఎమ్మెల్సీ ఎన్‌రోల్‌మెంట్‌ హెల్ప్‌డెస్క్‌ను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి, దేవరకద్ర, జడ్చర్ల ఎమ్మెల్యేలు జీ.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి విజయం కోసం పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతనం చేస్తూ అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియపై అవగాహన పెంచుకుని తమ పేర్ల నమోదు కోసం హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేయర్‌ మమత, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు సత్తూరు చంద్రకుమార్‌గౌడ్‌, వినోద్‌కుమార్‌, ఎన్పీ వెంకటేశ్‌, సీజే బెనహర్‌, బెక్కరి అనిత, రాజేందర్‌రెడ్డి, సీజె పూజిత, ప్రవీణ్‌కుమార్‌, రాధ, సువర్ణ, ఆంజనేయులు, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 11:32 PM