Share News

చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం..

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:38 PM

చారి త్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనంద రిపై ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

చారిత్రక కట్టడాలను  కాపాడుకుందాం..
విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి టౌన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): చారి త్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనంద రిపై ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం మార్నింగ్‌ వాక్‌లో భాగంగా పా లిటెక్నిక్‌ కళాశాల భవనాన్ని సందర్శించారు. భవన ప్రస్తుత స్థితిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పునరుద్ధరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను మంజూ రు చేసిందని, త్వరలోనే పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాకే తలమానికంగా నిలిచే ఇలాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకో వాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రాజప్రాసా దానికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా కృషి చే స్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆక్కడే క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థులతో కలిసి కాసేపు ఎమ్మెల్యే క్రికె ట్‌ ఆడారు. ఆయన వెంట మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, నాయకులు కదిరె రాములు, తిరుపతయ్య, బ్రహ్మంచారి, వాకిటి ఆదిత్య, మునిసి పల్‌ కౌన్సిలర్లు ఉన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:38 PM