Share News

ఎల్‌నినో ఇబ్బందులను సమష్టిగా ఎదుర్కొందాం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:51 PM

ఎల్‌నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నా రు.

ఎల్‌నినో ఇబ్బందులను సమష్టిగా ఎదుర్కొందాం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్లు, అధికారులు

  • భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

  • అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

గద్వాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నా రు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు హైదరాబాద్‌ నుంచి పలువురు ఉన్నతాధికారులతో కలిసి అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ పాల్గొన్న అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగవంతం చేశామని, అవార్డు పాసైన రైతులకు సత్వరమే డబ్బు చెల్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున ప్రజలకు తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. రబీ సీజన్‌లో రైతులు తమ బోరుబావుల్లో నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. సమావేశంలో భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాస రావు, కలెక్టరేట్‌ ఏవో మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:51 PM