Share News

నర్సాయిపల్లిలో చిరుత కలకలం

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:06 PM

నాగర్‌కర్నూల్‌ జి ల్లా కోడేరు మం డల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించి ఫారెస్టు అధికారు లకు సమాచారం ఇచ్చారు.

నర్సాయిపల్లిలో చిరుత కలకలం
- సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు

కోడేరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జి ల్లా కోడేరు మం డల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించి ఫారెస్టు అధికారు లకు సమాచారం ఇచ్చారు. ఆదివారం కొల్లాపూర్‌ ఫారెస్టు అధికారులకు చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం చేరవేయగా ఫారెస్టు అధికారులు, ఫారెస్టు డిప్యూటి రేంజర్‌ కాశన్న ఆధ్వర్యంలో సె క్షన్‌ ఆఫీసర్‌ శివకుమార్‌, బీట్‌ ఆఫీసర్‌ గౌడ్‌, రైతులు కలిసి ఆ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. చిరుత కాళ్ల జాడ లేదని నిర్దారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఫారెస్టు ఽఅధికారులు మైలారం, ఎత్తం, నర్సాయిపల్లి తదిత ర గ్రామాల్లో గొర్రెలు, బర్రెలు, ఆవులు తదితర వాటిని రాత్రి వేళలో పొలా ల దగ్గర ఉంచవద్దని గ్రామాల్లో ఉంచుకోవాలని రైతులకు సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి చిరుత పులిని గమనించి వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.

Updated Date - Mar 08 , 2026 | 11:06 PM