Share News

గ్రామీణ ప్రాంతాలకు న్యాయ సేవలు

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:30 PM

న్యాయ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయాధికారి ఎస్‌.ప్రేమలత పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలకు న్యాయ సేవలు
మాట్లాడుతున్న జిల్లా న్యాయాధికారి ప్రేమలత

- జిల్లా న్యాయాధికారి ప్రేమలత

కోయిలకొండ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : న్యాయ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయాధికారి ఎస్‌.ప్రేమలత పేర్కొన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయసేవ సదస్సు, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు అయ్యవారిపల్లి గ్రామాన్ని మెగా డ్రైవ్‌ క్రింద ఎంపిక చేసి, న్యాయ సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పేదలకు అందాల్సిన పథకాలను చట్టపరంగా అందించుటకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి ఆయా శాఖలకు ప్రతిపాదనలు పంపించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు పట్టింపులకు పోయి గొడవలు పెట్టుకొని సమస్యలు తెచ్చుకోవద్దని, ఏదైన న్యాయ సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. వైద్య శిబిరంలో వైద్య సేవలు నిర్వహించి, మందులు అందజేశారు. న్యాయమూర్తులు పి.ఆంజనేయులు, మహ్మద్‌ అఫ్రోజ్‌ అక్తర్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, ఎంఎన్‌జే కాన్సర్‌ ఆసుపత్రి డాక్టర్‌ కీర్తన, జిల్లా సంక్షేమాధికారి జరినా బేగం, ఎంపీడీవో ధనుంజనేయులుగౌడ్‌, సర్పంచు వాగ్యరామునాయక్‌, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి చంద్రశేఖర్‌, నాయకుడు మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:30 PM