విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:17 PM
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా ఉపా ధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
కేరీర్ గైడెన్స్‌పై అవగాహన అవసరం
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా ఉపా ధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శుక్ర వారం గద్వాల మండలం వీరాపురం సమీపంలో ని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశా లను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసం దర్భంగా కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పరీక్ష ఫలి తాలపై ఆరా తీశారు. వెనుబడిన సబ్జెక్టులపై ప్ర త్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థుల భ విష్యత్ లక్ష్యాల గురించి అడిగి అందుకు అవస రమైన నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకా శాలను తెలియజేశారు. ప్రస్తుత పోటీ ప్రపం చంలో ఏ రంగంలో రాణించాలన్న నైపుణ్యాలు అవసరమని, అందుకు విద్యార్థులకు కేరీర్ గైడె న్స్‌పై తరచూ అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం డ్రగ్స్, బెట్టింగ్ వంటి వ్యవసనాలు యువతను పట్టి పీడిస్తున్నాయని, ఇలాంటి వ్య సనాల బారిన విద్యార్థులు పడకుండా సంస్కా రంతో కూడిన విద్యను అందజేసే బాధ్యత ఉపా ధ్యాయులపై ఉందన్నారు. ఇటీవల నిర్వహించి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చిన వి ద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థు లు ఆయాసబ్జెక్టులపై ఆసక్తితో చదివేలా ప్రయో గ పూర్వకంగా బోధించాలన్నారు. గతేడాది ఎస్ ఎస్‌సీ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారి కంటే ఈఏడాది పరీక్ష ఫలితాల్లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. గురుకులంలో విద్యార్థులకు మెనూప్రకారం భోజనం వడ్డించాలని, తాగునీరు కలుసితం కాకుండా తగు చర్యలు తీసుకోవాల న్నారు. వాస్‌రూమ్స్ శుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగై న సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్లు ఉండడానికి వీలులేదని, ఈ విషయంతో తగు పర్యవేక్షణ నిరంతరం చేస్తుండాలని సిబ్బందిని ఆదేశించారు.