ముగిసిన లీగ్ మ్యాచ్‌లు
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:07 AM
ఎస్జీఎ ఫ్‌ఐ జాతీయ అండర్-17 బాలుర క్రికెట్ టో ర్నమెంట్‌లో బుధవారం నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిశాయి.
- హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు
- 32 బంతులలో 56 పరుగులు చేసిన ఒడిశా క్రీడాకారుడు సంసారియా
- ప్రారంభమైన ప్రీక్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు
జడ్చర్ల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ఎస్జీఎ ఫ్‌ఐ జాతీయ అండర్-17 బాలుర క్రికెట్ టో ర్నమెంట్‌లో బుధవారం నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిశాయి. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకు న్న 8 జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగాయి. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లలోని ఐదు మైదా నాలలో బుధవారం 8 లీగ్ మ్యాచ్‌లు జరిగా యి. జడ్చర్ల మినీస్టేడియంలో మొదటి మ్యా చ్ కేవీఎస్, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. కే వీఎస్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్, ఐబీఎస్‌వో జట్ల మ ధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 93 పరుగుల భా రీ స్కోర్‌తో జమ్మూకశ్మీర్ జట్టు విజయం సా ధించింది. జమ్మూకశ్మీర్ జట్టుకు చెందిన కబీ ర్ 44 బంతులలో 56 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పాటు అందించాడు. జడ్చర్ల పట్టణంలోని స్వామినారాయణ గురుకుల పా ఠశాలలోని మైదానంలో మొదటి మ్యాచ్ పంజాబ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఆరు వికెట్లతో తేడాతో పంజాబ్ జట్టు విజ యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇమామ్, ఆర్యన్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. రెం డవ మ్యాచ్‌లో డామన్ అండ్ డయ్యు, జార్ఖం డ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో జార్ఖండ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్ మూడు వికెట్లు తీశాడు. మహబూబ్‌నగర్ తిరుమల హిల్స్‌లోని సమర్థపాఠశాల మైదానంలో జరి గిన మొదటి మ్యాచ్‌లో సీఐఎస్‌సీఈ, డీఏవీ జట్లు తలపడ్డాయి. మూడు వికెట్ల తేడాతో డీఏవీ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆదిత్య, రిథిమ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. రెండవ మ్యాచ్‌లో బీహర్, ఛండీఘర్ జట్ల మధ్య జరిగింది. ఛండీఘర్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ మూడు వికెట్లు తీశాడు. మహబూబ్‌నగర్‌లోని బీఎస్సార్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో గోవా, ఒడిశా జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఒడిశా జట్టు గె లిచింది. 32 బంతులలో 56 పరుగులు చేసి జట్టు విజయానికి సంసారియా తోడ్పాటు అందచేశాడు. మహబూబ్‌నగర్‌లోని ఎండీసీ ఏ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎస్‌సీ, హర్యానా జట్లు మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో హర్యానా జట్టు విజ యం సాధించింది. అనిరుధ్ తాను వేసిన మూడు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశాడు.