నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:38 PM
నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావే శం నిర్వహించడం ద్వారా విద్యార్ధుఽల్లో నాయక త్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
విద్యార్థులతో నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం
గద్వాల న్యూటౌన్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావే శం నిర్వహించడం ద్వారా విద్యార్ధుఽల్లో నాయక త్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమంలో 22పీఎం శ్రీ పాఠశాలల నుంచి 44 మం ది విద్యార్ధులు వివిధ దేశాల ప్రతినిధులుగా పా ల్గొనే తమ వాణి వినిపించారు. మానవ హక్కు లు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌పై నిర్వహించిన ఈకార్యక్రమానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యా ప్తంగా సుమారు 193 దేశాలు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలుగా ఉన్నాయని, విద్యార్థులకు అంత ర్జాతీయ స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందున్నారు. విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దవచ్చని, వారికి నాయకత్వ లక్షణాలు, వాదన నైపుణ్యాలు, అంతర్జాతీయ సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. డీఈవో విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా నుంచి ఎంపికైన 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి వెళ్లనున్నారని తెలిపా రు. సమావేశంలో ఏఎంవో మైఖల్, సోషల్ ఫో రం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, ప్రతాప్, నరసింహులుగౌడ్ తదితరులు ఉన్నారు.