Share News

మార్కెట్‌ పాలకవర్గంపై నాయకుల ఆశలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:16 PM

నారాయణపేట వ్యవ సాయ మార్కెట్‌ కొత్త పాలకవర్గంపై నాయకులు కన్నేశారు.

మార్కెట్‌ పాలకవర్గంపై నాయకుల ఆశలు
పేట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం

- నారాయణపేట చైర్మన్‌గిరి బీసీ మహిళకు రిజర్వ్‌.?

నారాయణపేట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట వ్యవ సాయ మార్కెట్‌ కొత్త పాలకవర్గంపై నాయకులు కన్నేశారు. మార్కెట్‌ చైర్మన్‌గిరి ఈసారి బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యే అవకాశాలు అధికంగా ఉండడంతో ఆ వర్గం నాయకులు ఎ వరికి వారు తమ ప్రయత్నాలు ము మ్మరం చేశారు. సతీమణులను నిల బెట్టి ఎలాగైనా సరే చైర్మన్‌ పీఠం దక్కించుకోవా లనే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎమ్మె ల్యే చిట్టెం పర్ణికారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి ఆశీస్సులు పొందేం దుకు ఆశావహులు ఎవరికి వారు యత్నిస్తుం డడంతో అధికార కాంగ్రెస్‌ శిబిరంలో మార్కెట్‌ పాలక వర్గం ఎంపిక వేడి రాజుకుంది. మరో వైపు నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ పా లక వర్గం గడువు సెప్టెంబరు 15న ముగి య డంతో తాజాగా ప్రభుత్వం మార్కెట్‌ కమి టీకి పర్సన్‌ ఇన్‌చార్జిగా ఏడీఎం బాలమణిని ని య మించింది. దాంతో తాజా మాజీ చైర్మన్‌ శివారె డ్డి తన పదవీ కాలం ఆరునెలల పొడగింపు కో సం ఎమ్మెల్యేతో పాటు, కుంభంలకు విన్నవించి ఒత్తిడి తీసుకు వచ్చినా వారి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించక ఆయనకు నిరాశే ఎదురైంది.

Updated Date - Oct 13 , 2026 | 11:16 PM