చట్టాలు అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:42 PM
సాం కేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి అ నుగుణంగా చట్టాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తె లంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నా రు.
- ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సాం కేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి అ నుగుణంగా చట్టాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తె లంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నా రు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని లా కాలేజీలో నిర్వహించిన టె క్నాలజీ అండ్ లా ప్రత్యేక సెమినార్‌లో ఆయన మాట్లాడారు. విమాన యానం, అంతరిక్షం, రక్షణ, సముద్రరంగం, ఐటీ రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, అదే ఊపులో న్యాయరంగం కూడా దూసుకు పోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తరిస్తున్న నేపఽ థ్యంలో న్యాయవిద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సర్టిఫికెట్ కోసం చదవకం డని... జ్ఞానం కోసం చదవండని విద్యార్థులకు సూచించారు. న్యాయ వి ద్యార్థులు తరగతులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. నాలెడ్జ్, ప్రా క్టికల్ ఎక్స్‌పోజర్, కొత్త సాంకేతికతలపై అవగాహన భవిష్యత్ న్యాయ వృత్తిలో ఎంతో కీలకం అన్నారు. పాలమూరు జిల్లాతో తనకు ఎంతో అ నుబంధం ఉందని, విశ్వవిద్యాలయం అభివృద్ధి, లా కాలేజీ ప్రగతికి అ వసరమై సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ సెమినార్ లో రిజిస్ట్రార్ ఆచార్య పి.రమేష్‌బాబు, ప్రొఫెసర్ చంద్రకిరణ్, లా కళాశా ల ప్రిన్సిపాల్ భూమయ్య, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ ఈశ్వర్‌కుమార్, సుప్రీంకోర్టు న్యాయవాది శివచరణ్ తదితరులు పాల్గొన్నారు