Share News

భారీగా నల్ల బెల్లం, పటిక, గుడుంబా పట్టివేత

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:15 PM

నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరకుల అక్రమ రవాణాపై ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం (ఎస్‌టీఎఫ్‌) పెద్ద మొత్తంలో బెల్లం పట్టుకుంది.

 భారీగా నల్ల బెల్లం, పటిక, గుడుంబా పట్టివేత

- ఒకరి అరెస్టు

తెలకపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడిసరకుల అక్రమ రవాణాపై ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం (ఎస్‌టీఎఫ్‌) పెద్ద మొత్తంలో బెల్లం పట్టుకుంది. బుఽధవారం సాయం త్రం నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లి శివారులోని కల్వకుర్తి రోడ్డు వైకుంఠ ధామం వద్ద ఎస్‌టీఎఫ్‌ బృందం నిర్వహించిన తనిఖీలలో భారీ మొత్తంలో నల్లబెల్లం, పటిక, గుడుంబా పట్టుబడ్డాయి. విశ్వస నీయ సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్‌ ఎక్సైజ్‌ సూపర్టెంట్‌ విష్టుమూర్తి పర్యవేక్షణలో హైదరాబాద్‌ ఎస్‌టీఎఫ్‌ ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్సెక్టర్‌ ఎస్‌. రమేష్‌ సిబ్బంది తెలకపల్లి పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్ర మంగా తరలిస్తున్న బెల్లం బయటపడింది. వారి నుంచి నల్ల బెల్లం 342కిలోలు, పటిక:200 కిలోలు, గుడుంబా: 10 లీటర్లు వాహనం స్వాధీనం చేసుకొని వాహనాన్ని నడుపుతున్న ఉప్పల నవీన్‌ లింగాల మండలం జీలుగుపల్లె నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఈ సరుకును కొనుగోలు చేసి స్థానికంగా గుడుంబా తయారీదా రులకు, వినియోగదారులకు అమ్ముతున్నట్లు అంగీకరించాడు. పంచనామా నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసిన ఎస్‌టీఎఫ్‌ అధికారులు, స్వాధీనం చేసుకున్న బొలెరో వాహనాన్ని తదుపరి చ ట్టపరమైన చర్యలు నిమిత్తం తెలకపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించారు.

Updated Date - Nov 18 , 2026 | 11:15 PM