భూసర్వే మ్యాపులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:20 PM
భూముల రిసర్వే చేపట్టి క్షేత్ర స్థా యిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణం గా మ్యాపులను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో న మోదు చేయాలని సర్వే అధికారులను క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించా రు.
బిజినేపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్ర జ్యోతి): భూముల రిసర్వే చేపట్టి క్షేత్ర స్థా యిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణం గా మ్యాపులను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో న మోదు చేయాలని సర్వే అధికారులను క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించా రు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండ లంలోని ఖానాపూర్‌లో 2,525 ఎకరాల 15 గుంటల భూములను రీసర్వే ప్రక్రియలోకి తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. రీసర్వే ద్వారా భూముల హద్దులు ఏర్పాటు చే యడంతో పాటు భూరికార్డుల నమోదులో స్పష్టత రావడంతో భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అ న్నారు. సర్వే సమయంలో రైతులకు సమ స్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకరావా లని సూచించారు. అనంతరం ఖానాపూ ర్‌లో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠ శాలను పరిశీలించారు. పాఠశాలకు అవస రమైన మౌలిక వసతులతో పాటు అదన పు తరగతి గదుల నిర్మాణానికి స్థల పరిశీ లన చేస్తే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం నంది వడ్డెమాన్‌లో పశు సంవ ర్ధక శాఖ అధ్వర్యంలో చేపట్టిన ఫర్టిలిటీ క్యాంపును పరిశీలించారు. కృత్రిమ గర్భధా రణకు పశువైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పశువు లకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతమైన పశు సంపద అభివృద్ధి పాటుపడాలని ఆదేశించారు. ఆయన వెం ట తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కతలప్ప, నంది వడ్డేమాన్ గ్రామ సర్పంచ్ సుగుణమ్మ, ఖానాపూర్ ఉప సర్పంచ్ రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు ఉన్నారు.