ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు భూసేకరణ
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:26 PM
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని తోగాపూర్ శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది.
- గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ
కోస్గి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని తోగాపూర్ శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది. గురువారం నారాయణపేట ఆర్డీవో రాంచందర్ ఆధ్వర్యంలో తొగాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ శివారులో 209 ఎకరాల లావిన్‌పట్టా భూములు, 176 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని 385 ఎకరాలలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నా మని ఆర్డీవో తెలిపారు. అందుకు లావిన్ ప ట్టాదారులు ప్రభుత్వ ధరకు భూమి ఇవ్వాలని ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ప్ర భుత్వం నిర్దేశించిన ధర ప్రకారం భూములు కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. అం దుకు ప్రజల నుంచి సానుకూలంగా అభిప్రా యాలు తెలపారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌ఐ సుభాష్‌రెడ్డి తదితరులున్నారు.