భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:31 PM
మక్తల్-నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన భూసేకరణ ప్రక్రి యను వేగవంతం చేసి, పెండిం గ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాం క రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
- పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మక్తల్-నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన భూసేకరణ ప్రక్రి యను వేగవంతం చేసి, పెండిం గ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాం క రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి తహసీల్దార్లతో భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసేకరణకు సంబంధిత రైతులతో ఉన్న సమ స్యలను గుర్తించి వారితో చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రతిపాదనలు, పరిహారం చెల్లింపులు, సర్వే నంబర్లకు సంబం ధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరి ష్కరించాలన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉ న్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు నిర్వహించే అవకాశం ఉ న్నందున భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. భూసేకరణ పనుల పురోగతిపై వచ్చేవారం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటిలోగా నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనుల్లో పురోగతి సా ధించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్డీవో రమేష్, ఏవో అనిల్కుమార్, నా రాయణపేట, ఊట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమాల్, కోస్గి, మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
స్త్రీనిధి రుణాల రికవరీ, క్రెడిట్ పంపిణీలో పురోగతి సాధించాలి
స్ర్తీనిధి రుణాల రికవరీ, క్రెడిట్ పంపిణీ, స్వ యం సహాయక సంఘాలకు సంబంధించిన ల క్ష్యాల సాధనలో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. వెనుకబడిన మండలాలు, తక్కువ పనితీరు కన బరుస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(సీసీ) పని తీరును సమీక్షించి, నిర్ధేశిత లక్ష్యాలను సాధిం చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్ట రేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణా భివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్ర్తీనిధి క్రెడిట్ కోఆప రేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ జిల్లాస్థాయి రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావే శానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్ర్తీనిధి రుణాల రికవరీలో ప్రస్తుత పురోగతి సం తృప్తికరంగా ఉన్నప్పటికీ మరింత మెరుగుదల కు అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతీవారం మండలాల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ప్రతీ నెల సీసీల పనితీరును అంచనా వేయాలని ఆదే శించారు. మండలాల వారీగా పనితీరును నెల రోజుల తరువాత మరోసారి సమీక్షిస్తామని, అ ప్పటివరకు వెనుకబడిన ప్రాంతాలు, సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలె క్టర్ స్పష్టం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకట్రాములు, ఎల్డీఎం సురేష్ ఆ త్రేయ, మునిసిపల్ కమిషనర్ శంకర్, జిల్లా మ హిళా సమాఖ్య సభ్యురాలు, స్ర్తీ నిధి సిబ్బంది, ఏపీఎంలు, సీసీలు, అధికారులు పాల్గొన్నారు.