Share News

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:40 PM

పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరు అందించేందు కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు.

భూసేకరణ వేగవంతం చేయాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న గద్వాల కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌

- రబీలో వరి వేయకుండా అవగాహన కల్పించాలి

- తాగునీటి అవసరాలకు జూరాల నీటిని నిల్వ ఉంచాలి

-కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరు అందించేందు కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు. గురువారం గద్వాల కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. నెట్టెంపాడు ఎత్తిపోత ల పథకం భూసేకరణ ఆలస్యం చేయడం తగ దని, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో రోజువారి లక్ష్యాలను నిర్ధేశించు కుని భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అవార్డు పూర్తి అయిన రైతుల కు ఆలస్యం చేయకుండా సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూరాల రిజర్వాయర్‌ చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతు లు రబీలో వరిసాగు చేయకుండా గ్రామ సభ లు నిర్వహించి అవగాహన కల్పించాలని సూ చించారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృ ష్టిలో ఉంచుకుని జూరాల రిజర్వాయర్‌లో తగి నంత నీటిని నిల్వ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధు మోహన్‌, భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, సర్వే ఏడీ, ఇరిగేషన్‌ ఈఈలు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:40 PM