భూ సేకరణ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:33 PM
జిల్లాలో భారత్‌మాల జాతీయ రహదారి, రైల్వేలైన్ డబ్లింగ్, నీటిపారుదల ప్రాజెక్టులు, పార్రిశామిక ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికా రులను ఆదేశించారు.
- కలెక్టర్ ఖుష్బూగుప్తా
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భారత్‌మాల జాతీయ రహదారి, రైల్వేలైన్ డబ్లింగ్, నీటిపారుదల ప్రాజెక్టులు, పార్రిశామిక ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో జా తీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ), రెవెన్యూ, నీటిపారుదల, రైల్వే లైన్ డిబ్లింగ్, టీజీఐఐసీ బ్రహ్మోస్ క్షిపణి తయారీ పారిశ్రామిక పార్కు, కురుమూర్తి ఆలయ అభివృద్ధి, ఎంజీకేఎల్‌ఐ, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుల సంబంధించిన భూసేకరణతో పాటు పునరావాస పరిహారం కార్యక్రమాలపై సమీక్షించారు. భారత్‌మాల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అవార్డు పూర్తయిన యాజమానులకు పరిహారం చెల్లింపులు, మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఇప్పటికి దాక సేకరించిన భూ మికి సంబంధించిన పరిహారం చెల్లింపులను లబ్ధిదారుల ఖాతాల్లో వేగవంతం చేయాలన్నారు. రైల్వేలైన్ డబ్లింగ్‌కు భూసేకరణలో అవార్డులు విచారణలు, పెండింగ్ భూసేకరణ, దేవరకద్ర మండలంలోని బ్రహ్మోస్ క్షిపణి తయారీ సం బంధించిన భూసేకరణ, అమర్‌రాజా పరిశ్రమకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేక రణ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం భూభారతి, సాదాబైనామా, రీసర్వే, నక్షా, సర్వే, మీ సేవా, డబుల్‌బెడ్ ఇళ్ల పంపిణీ, 22 కింద ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల అంశాలపై సమీక్షించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు మధు సూదన్‌నాయక్, హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ రామ్ రెడ్డి, ఆర్డీవో నవీన్, భూసర్వే రికార్డు అధికారి ఏడీ అశోక్ పాల్గొన్నారు.