భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:03 PM
జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సమస్యలు త్వరతగతిన పరిష్కరించి, పనుల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు.
- కలెక్టర్ ఖుష్బూగుప్తా
మహబూబ్‌నగర్ కలెక్టర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సమస్యలు త్వరతగతిన పరిష్కరించి, పనుల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. భారత్‌మాల జాతీయ రహదారి, రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. బ్రహ్మోస్ క్షిపణి పరిశ్రమ ఏర్పాటుకు సేకరించిన భూములకు సంబంఽధించి పెండింగ్ అవార్డులను జారీ చేసి, భూములను స్వాధీనం చేసుకుని సంబంధిత సంస్థకు అప్పగించాలన్నారు. అదనపు కలెక్టర్ హరిప్రియ, డీఆర్వో నిర్మల, ఆర్డీవో నవీన్, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, భూ సర్వే రికార్డుల ఏడీ అశోక్, మునిసిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.
రెవెన్యూ పెండింగ్ పైళ్లను పరిష్కరించాలి
రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, జిల్లాలో భూముల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. మీసేవ, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, కోర్టు కేసులు, భూదాన్ భూముల వివరాల ఆన్‌లైన్ నమోదు, రైల్వే లైన్ డబ్లింగ్, భారతమాల జాతీయ రహదారుల కోసం సేకరించి భూముల మ్యూటేషన్, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, సాదాబైనామా కేసులు, జీవో 59 కింద ప్లాట్ల క్రమబద్దీకణ, రీసర్వే పురోగతిని మండలాల వారిగా సమీక్షించారు.