Share News

లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:14 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని వె లుగొమ్ముల గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వా మి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి క ల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవం గా నిర్వహించారు.

 లక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం
కల్యాణోత్సవాన్ని జరిపిస్తున్న వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు

మిడ్జిల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలంలోని వె లుగొమ్ముల గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వా మి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి క ల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవం గా నిర్వహించారు. వేదపండితుల మంత్రో చ్ఛారణలు, శాస్ర్తోక్త విధానాలతో జరిగిన ఈ కల్యాణోత్సవం భక్తుల్లో అపార భక్తి ఉ త్సాహాన్ని నింపింది. స్వామి వారి కల్యాణో త్సవానికి బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌ప ర్సన్‌ జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు శాలువాలతో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ఆ లయాన్ని విద్యుద్దీపాల అలంకరణతో సుం దరంగా ముస్తాబు చేయగా, గ్రామం నలు మూలల నుంచి వ చ్చిన భక్తులతో ఆల య ప్రాంగణం కి టకిటలాడింది. కల్యా ణోత్సవానికి హాజరై న భక్తులకు ఆలయ కమిటీ, దాతల సహా యంతో అన్నదానం నిర్వహించారు. అం తకు ముందు గ్రా మానికి కేటాయించి న ఆర్టీసీ బస్సుకు పూజలు చేసి ప్రా రంభించారు. గ్రామ సర్పంచ్‌ సువర్ణ, ఉప సర్పంచ్‌ లక్ష్మమ్మ, ఆలయ కమిటీ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు దేవేం దర్‌, మాసయ్య, సాయులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో పాటు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:14 PM